ఇసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు. కౌటాల మండలంలోని ముత్యంపేటలో బావిలోకి దిగిన ముగ్గురు యువకులు ఊపిరాడక మృతి చెందారు.

ముత్యంపేట గ్రామంలో బావిలోకి దిగిన ముగ్గురు యువకులు  శ్వాస అందక మృత్యువాత పడ్డారు. రాకేష్, మహేష్, శ్రీనివాస్‌లు మృతి చెందినట్టుగా గుర్తించారు. అయితే వీరు ముగ్గురు బావిలోకి ఎందుకు దిగారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.