నిర్మల్ జిల్లా ముథోల్ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ స్కూల్ లోని 27 మంది విద్యార్ధులకు కరోనా సోకింది.

ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ స్కూల్ లోని 27 మంది విద్యార్ధులకు కరోనా సోకింది.

ముథోల్ గురుకుల స్కూల్ లో విద్యార్ధులు, టీచర్లకు పరీక్షలు నిర్వహిస్తే 17 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో ఈ స్కూల్ లో కరోనా సోకిన విద్యార్ధుల సంఖ్య 27కి చేరుకొంది. శనివారం నాడు ఇదే స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్ధులకు కరోనా సోకింది. 

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్ల విషయంలో ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం చర్చిస్తోంది. 8వ తరగతి లోపు విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం లేకపోలేదు. 

రాష్ట్రంలో పలు గురుకుల పాఠశాలలు, స్కూళ్లు,కాలేజీల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఆన్ లైన్ క్లాసులు తిరిగి ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే విషయమై విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.