తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 2646 మందికి పాజిటివ్
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,206 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2646 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 3603 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని (corona deaths in telangana) వెల్లడించింది
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,206 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2646 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 3603 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని (corona deaths in telangana) వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు 3.23 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు చేయగా.. 7.69 లక్షల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 4094 మంది మరణించగా... 7.30 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కొవిడ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 747 మంది కోవిడ్ బారినపడ్డారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 60, భద్రాద్రి కొత్తగూడెం 71, జీహెచ్ఎంసీ 747 జగిత్యాల 41, జనగామ 43, జయశంకర్ భూపాలపల్లి 35, గద్వాల 15, కామారెడ్డి 44, కరీంనగర్ 102, ఖమ్మం 81, మహబూబ్‌నగర్ 78, ఆసిఫాబాద్ 16, మహబూబాబాద్ 48, మంచిర్యాల 55, మెదక్ 58, మేడ్చల్ మల్కాజిగిరి 177, ములుగు 23, నాగర్ కర్నూల్ 26, నల్గగొండ 86, నారాయణపేట 20, నిర్మల్ 19, నిజామాబాద్ 58, పెద్దపల్లి 51, సిరిసిల్ల 38, రంగారెడ్డి 157, సిద్దిపేట 101, సంగారెడ్డి 81, సూర్యాపేట 88, వికారాబాద్ 43, వనపర్తి 38, వరంగల్ రూరల్ 31, హనుమకొండ 82, యాదాద్రి భువనగిరిలో 53 చొప్పున కేసులు నమోదయ్యాయి.
కాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కరోనా వివరాలపై బులెటిన్(Health Ministry Corona Bulletin) విడుదల చేసింది. దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.
ఒమిక్రాన్ మూలంగా మన దేశంలో మరోసారి కేసులు పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో కేసులు ఒకానొక దశలో మూడున్నర లక్షలకు చేరువ అయ్యాయి. జనవరి 21వ తేదీన 3.47 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్‌లో పీక్ 3.47 లక్షల కేసులే. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 1.61 లక్షలకు తగ్గాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతున్నది. తాజాగా నమోదైన మరణాలు ఈ ఏడాదిలోనే అత్యధికం. థర్డ్ వేవ్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. వారం క్రితం కరోనా మరణాల సంఖ్య 500 నుంచి 600 మధ్యలో ఉన్నది. 28వ తేదీన కాస్త పెరిగి 627కు పెరిగాయి. ఆ తర్వాత పెరుగుతూ మొన్న(నిన్నటి బులెటిన్‌లో) వెయ్యి మార్క్‌ను క్రాస్ అయ్యాయి. తాజాగా, ఈ మరణాలు మరింత పెరిగి రెండు వేలకు చేరువగా వెళ్లడం గమనార్హం .
కాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కరోనా వివరాలపై బులెటిన్(Health Ministry Corona Bulletin) విడుదల చేసింది. దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.
ఒమిక్రాన్ మూలంగా మన దేశంలో మరోసారి కేసులు పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో కేసులు ఒకానొక దశలో మూడున్నర లక్షలకు చేరువ అయ్యాయి. జనవరి 21వ తేదీన 3.47 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్‌లో పీక్ 3.47 లక్షల కేసులే. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 1.61 లక్షలకు తగ్గాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతున్నది. తాజాగా నమోదైన మరణాలు ఈ ఏడాదిలోనే అత్యధికం. థర్డ్ వేవ్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. వారం క్రితం కరోనా మరణాల సంఖ్య 500 నుంచి 600 మధ్యలో ఉన్నది. 28వ తేదీన కాస్త పెరిగి 627కు పెరిగాయి. ఆ తర్వాత పెరుగుతూ మొన్న(నిన్నటి బులెటిన్‌లో) వెయ్యి మార్క్‌ను క్రాస్ అయ్యాయి. తాజాగా, ఈ మరణాలు మరింత పెరిగి రెండు వేలకు చేరువగా వెళ్లడం గమనార్హం.
ఇవాళ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తాజాగా చోటుచేసుకున్న 1,733 మరణాలతో దేశంలో మొత్తం మరణాలు ఐదు లక్షలకు చేరువయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 4,97,975కి పెరిగాయి. 1,61,386 రికవరీలతో మొత్తం రికవరీల సంఖ్య 3,95.11,307కి చేరాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి పడిపోయింది. కాగా, వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉన్నది. ఇవాళ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తాజాగా చోటుచేసుకున్న 1,733 మరణాలతో దేశంలో మొత్తం మరణాలు ఐదు లక్షలకు చేరువయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 4,97,975కి పెరిగాయి. 1,61,386 రికవరీలతో మొత్తం రికవరీల సంఖ్య 3,95.11,307కి చేరాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి పడిపోయింది. కాగా, వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉన్నది.