తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 313 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,258 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 53,789 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 249 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అదే సమయంలో 313 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6,61,551కి చేరింది. 6,52,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,258 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,895కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 5, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 11, ఖమ్మం 12, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 6, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 17, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 18, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 6 , పెద్దపల్లి 4, సిరిసిల్ల 3, రంగారెడ్డి 13, సిద్దిపేట 5, సంగారెడ్డి 6, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 3, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 14, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…