తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 2,484 మందికి పాజిటివ్

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 65,263 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 2,484 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,61,050కి చేరుకుంది.

2484 new corona cases reported in telangana

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 65,263 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 2,484 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,61,050కి చేరుకుంది. తాజాగా మహమ్మారి కారణంగా (corona deaths in telangana) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,18,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 38,723 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.38 శాతంగా ఉంది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1045 మందికి పాజిటివ్‌గా తేలింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 26, భద్రాద్రి కొత్తగూడెం 43, జీహెచ్ఎంసీ 1045, జగిత్యాల 40, జనగామ 26, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల 12, కామారెడ్డి 11, కరీంనగర్ 80, ఖమ్మం 107, మహబూబ్‌నగర్ 70, ఆసిఫాబాద్ 12, మహబూబాబాద్ 36, మంచిర్యాల 31, మెదక్ 17, మేడ్చల్ మల్కాజిగిరి 138, ములుగు 16, నాగర్ కర్నూల్ 17, నల్గగొండ 108, నారాయణపేట 18, నిర్మల్ 8, నిజామాబాద్ 45, పెద్దపల్లి 21, సిరిసిల్ల 22, రంగారెడ్డి 130, సిద్దిపేట 70, సంగారెడ్డి 58, సూర్యాపేట 69, వికారాబాద్ 27, వనపర్తి 31, వరంగల్ రూరల్ 24, హనుమకొండ 88, యాదాద్రి భువనగిరిలో 28 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు దేశంలో క‌రోనా(Coronavirus) ప్రభావం కొన‌సాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త  కేసులు న‌మోద‌వుతున్నాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. కొత్త‌గా 893 మంది క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్త క‌రోనా (Coronavirus)మర‌ణాల సంఖ్య 4,94,091 పెరిగింది. ఇదే సమయంలో 2,34,281 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 4,10,92,522 చేరుకుంది. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 18,84,937 క్రియాశీల కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,52,784 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494కు పెరిగింది. 

మొత్తం (Coronavirus) కేసుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య 4.59 శాతంగా ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 94.21 శాతానికి చేరుకుంది. అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 13 శాతం నుంచి 14.50 శాతానికి పెరగ‌డంపై ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉండ‌గా, వారాంత‌పు క‌రోనా(Coronavirus) పాజిటివిటీ రేటు 16.40 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వ్యాక్సినేష్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌లను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios