తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 324 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,701 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 248 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, నల్గొండ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,64,898కి చేరింది. తెలంగాణలో మొత్తం 6,56,285 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారినపడిన మృతి చెందిన వారి సంఖ్య 3,912కి పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 66, జగిత్యాల 9, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 21, ఖమ్మం 13, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 6, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 17, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 10, సిరిసిల్ల 4, రంగారెడ్డి 18, సిద్దిపేట 2, సంగారెడ్డి 5, సూర్యాపేట 8, వికారాబాద్ 3, వనపర్తి 1, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 13, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…