తెలంగాణలో కరోనా కేసులు నిలకడగానే వున్నాయి. గత కొన్నిరోజులుగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2,384 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన  మొత్తం కేసుల సంఖ్య 5,83,228కి పెరిగింది. కరోనా వల్ల బుధవారం 17 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,313కి పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌‌లో పేర్కొంది. ఇవాళ 2,242 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 307 మంది వైరస్ బారినపడ్డారు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 113, జగిత్యాల 41, జనగామ  33, జయశంకర్ భూపాలపల్లి 57, గద్వాల 44, కామారెడ్డి 13, కరీంనగర్ 103, ఖమ్మం 167, మహబూబ్‌నగర్ 81, ఆసిఫాబాద్ 15, మహబూబాబాద్ 94, మంచిర్యాల 75, మెదక్ 23, మేడ్చల్ మల్కాజిగిరి 116, ములుగు 45, నాగర్ కర్నూల్ 28, నల్గగొండ 170, నారాయణపేట 13, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 95, సిరిసిల్ల 45, రంగారెడ్డి 135, సిద్దిపేట 102, సంగారెడ్డి 59, సూర్యాపేట 90, వికారాబాద్ 54, వనపర్తి 45, వరంగల్ రూరల్ 63, వరంగల్ అర్బన్ 86, యాదాద్రి భువనగిరిలో 31 చొప్పున కేసులు నమోదయ్యాయి.