Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో అదే తీవ్రత.. కొత్తగా 2,319 కరోనా కేసులు, 7,00,094కి చేరిన సంఖ్య

తెలంగాణలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 90,021 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,319 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

2319 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Jan 12, 2022, 8:56 PM IST

తెలంగాణలో (corona cases in telangana) కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 90,021 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,319 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 7,00,094కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,047కి చేరింది. కరోనా నుంచి నిన్న 474 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 18,339 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా 1,275 కేసులు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కిందటి రోజు కరోనాతో 277 మంది మృతిచెందగా.. గత 24 గంటల్లో కరోనాతో 442 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశం ఇప్పటివరకు మహమ్మారితో మృతిచెందిన వారి సంఖ్య 4,84,655కి పెరిగింది. నిన్న దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,46,30,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,55,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. అదే సమయంలో వీక్లీ పాజిటివిటీ రేటు 9.82 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 85,26,240 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,53,80,08,200కి చేరింది. దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందివ్వడంతో పాటుగా, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ (omicron) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 1,805 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,281 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 645 ఒమిక్రాన్ కేసులతో రాజస్తాన్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 1,281, రాజస్తాన్‌లో 645, ఢిల్లీలో 546, కర్ణాటకలో 479, కేరళలో 350, పశ్చిమ బెంగాల్‌లో 294, ఉత్తరప్రదేశ్‌లో 275, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 162, తెలంగాణలో 123, ఒడిశాలో 102, ఆంధ్రప్రదేశ్‌లో 54, బిహార్‌లో 27, పంజాబ్‌లో 27, గోవాలో 21, జమ్మూ కశ్మీర్‌లో 13, మధ్యప్రదేశ్‌లో 10, అసోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, చత్తీస్‌గఢ్‌లో 5, మేఘాలయలో 5, అండమాన్ నికోబార్ దీవుల్లో 3, చంఢీఘర్‌లో 3, పుదుచ్చేరిలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios