తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరికి ఏయే పోస్టులంటే..?
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. బుధవారం 23 మంది ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. బుధవారం 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో సీఎంవోలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ్టీతో దానికి తెరపడింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌ను నియమించింది. అయితే గంటల వ్యవధిలోనే 23 మంది ఐపీఎస్‌లను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.
- టెక్నికల్ సర్వీసస్ అదనపు డిజీగా వివి శ్రీనివాసరావు
- ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి
- మల్టీజోన్-7 డీసీపీగా జోయల్ డెవిస్
- సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ ధరావత్
- నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల
- రామగుండం సీపీగా ఎల్ఎస్ చౌహాన్
- మల్కాజ‌్‌గిరి డీసీపీగా పద్మజ
- నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మీల
- ఖమ్మం సీపీగా సునీల్ దత్
- సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్
- ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
- ఆదిలాబాద్ ఎస్పీగా గౌష ఆలం
- మాదాపూర్ డీసీపీగా వినిత్
- ములుగు ఎస్పీగా శబరీష్
- మేడ్చల్ డీసీపీగా నితికాపంత్
- సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
- ఎల్బీ నగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్
- కో ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్
- రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 3గా ఆర్ వెంకటేశ్వర్లు