తెలంగాణలో (Telangana) కొవిడ్‌ (covid) మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా కరోనా కేసులు (corona cases) వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2 వేల మార్క్‌ దాటాయి.

తెలంగాణలో (Telangana) కొవిడ్‌ (covid) మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా కరోనా కేసులు (corona cases) వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2 వేల మార్క్‌ దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 64,474 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,295 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,89,751కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో (covid deaths in telangana)ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 15, జీహెచ్ఎంసీ 1452, జగిత్యాల 6, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 6, కరీంనగర్ 184, ఖమ్మం 29, మహబూబ్‌నగర్ 8, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 22, మంచిర్యాల 17, మెదక్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 232, ములుగు 2, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 14, నారాయణపేట 4, నిర్మల్ 0, నిజామాబాద్ 29, పెద్దపల్లి 17, సిరిసిల్ల 8, రంగారెడ్డి 218, సిద్దిపేట 13, సంగారెడ్డి 50, సూర్యాపేట 14, వికారాబాద్ 9, వనపర్తి 7, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 54, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో Corona కేసులు లక్షను దాటాయి. గత 24 గంటల్లో 1.1లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 302 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగాయి. కరోనా Omicron కేసులు మూడు వేలకు చేరుకొన్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు India లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా రోగులు 30,836 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన రోగుల సంఖ్య 4,38,178కి చేరుకొంది. కరోనా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో 1,199 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,రాజస్థాన్ లో 291,కేరళలో 284, గుజరాత్ లో 204 కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు మహారాష్ట్రలో 36,265 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత 24 గంటల్లో 31.7 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని ఒమిక్రాన్ కేసుల్లో ఎవరికీ కూడా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టు అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ మరణాలు ఎక్కడా లేవని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కూడా ప్రకటించారు.దేశంలో గత 24 గంటల్లో 15, 13, 377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే వీరిలో 1,17,100 మందికి కరోనా నిర్ధారణ అయింది.

Scroll to load tweet…