తెలంగాణలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు మరణించారు. 244 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,599 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 46,193 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 67 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అదే సమయంలో 244 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,66,183కి చేరింది. తెలంగాణలో 6,57,665 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,599 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో వైరస్ వల్ల మృతుల సంఖ్య 3,919కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 67, జగిత్యాల 4, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 14, ఖమ్మం 10, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 10, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 14, ములుగు 1, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 9, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 8, సిరిసిల్ల 5, రంగారెడ్డి 15, సిద్దిపేట 5, సంగారెడ్డి 3, సూర్యాపేట 8, వికారాబాద్ 1, వనపర్తి 3, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…