తెలంగాణ (Telangana)లో కొత్తగా 218 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 248 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,390 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో (Telangana) గడిచిన 24గంటల్లో 46,578 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 218 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,66,971కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో (corona deaths in telangana) ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,924కి చేరింది. మహమ్మారి బారి నుంచి 24 గంటల వ్యవధిలో 248 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,390 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 69, జగిత్యాల 9, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 14, ఖమ్మం 7, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 15, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 14, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 9, సిరిసిల్ల 5, రంగారెడ్డి 11, సిద్దిపేట 3, సంగారెడ్డి 2, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…