తెలంగాణ (Telangana)లో కొత్తగా 207 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 196 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,897 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 38,467 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 207 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,77,954కి చేరింది. కరోనా సోకి నిన్న ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో (corona deaths in telangana) మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,004కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,897 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 668 మంది ప్రయాణీకులు చేరుకున్నారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. వీరిలో ఇద్దరికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ 15 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాల్లో 13 మందికి నెగెటివ్‌గా వచ్చింది. తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన ఇద్దరు బాధితుల ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 14, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 16, ఖమ్మం 7, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 5, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 0, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 5, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 6, సిరిసిల్ల 0, రంగారెడ్డి 19, సిద్దిపేట 1, సంగారెడ్డి 2, సూర్యాపేట 1, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 12, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…