KTR: తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా పేరు మార్చుతూ ఆ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో నాయకులు ఆమోదం తెలిపారు.
Bharat Rashtra Samiti: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుందనీ, పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పని ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత కెటి రామారావు (కేటీఆర్) తెలిపారు. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా పేరు మార్చుతూ ఆ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో నాయకులు ఆమోదం తెలిపారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అక్టోబర్ 5న టీఆర్‌ఎస్ జనరల్ బాడీ చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తర్వాత బీఆర్ఎస్ గా పేరు మార్చబడింది. పేరు మార్పునకు సంబంధించి ఆ పార్టీ నాయకుల బృందం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం సంప్రదించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ముందు ప్రాణాళికల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. త్వరలోనే పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కార్యకలపాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ విజయాన్ని ఉదహరిస్తూ.. తెలంగాణలో చేసిన మంచి పని అక్కడ బాగా తెలిసినందున తమ పార్టీ మొదట మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటుందని కేటీఆర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంలో ఆరోపించిన సంక్షోభం దృష్ట్యా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పని చేస్తుందని శుక్రవారం మీడియాతో అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 'ద్వేషపూరిత' రాజకీయాలు, ఫెడరలిజంపై దాడి వంటి అంశాలను ప్రస్తావించిన కేటీఆర్.. సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ విజయవంతమైన 'తెలంగాణ నమూనా'ను దేశానికి అందించాలని కోరుకుంటున్నదని తెలిపారు.
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఎల్‌పీజీ ధరలు బాగా పెరిగాయనీ, దినికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరే కారణమని ఆరోపించారు. మరోవైపు తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు, వ్యవసాయోత్పత్తులు, జీఎస్‌డీపీ, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల పెరుగుదలను తాను అంచనా వేయగలనని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రతి ఇంటికి తాగునీరు, రైతులకు 24x7 ఉచిత విద్యుత్‌ను సాధించగలిగితే.. 8 సంవత్సరాలలో రైతులకు 'రైతు బంధు' పెట్టుబడి మద్దతు పథకం వంటి పథకాలను అమలు చేయగలిగితే, ఇతర రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దేశంలో కేంద్రం ఎందుకు అలాంటి చేయడం లేదు? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఆయన.. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగినా ఎదుర్కొంటుందని చెప్పారు. బీజేపీ పాలన వైపల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాము బహిర్గతం చేస్తామని చెప్పారు. అలాగే, ప్రతిపక్ష కాంగ్రెస్ పైనా కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైందనీ, ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పిన ఆయన.. ముందుగా కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచించారు. కాంగ్రెస్ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
