Asianet News TeluguAsianet News Telugu

2018 ఈయర్ రౌండప్: విపక్షాలకు చెక్, టీఆర్ఎస్‌దే అధికారం

టీఆర్ఎస్‌కు 2018 సంవత్సరం  కలిసొచ్చింది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసినా కూడ కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చారు

2018 year roundup: trs second time got power in telangana state this year
Author
Hyderabad, First Published Dec 25, 2018, 6:08 PM IST


హైదరాబాద్: టీఆర్ఎస్‌కు 2018  సంవత్సరం కలిసొచ్చింది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసినా కూడ కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చారు.రెండో దఫా అధికారంలోకి రావడంతో విపక్షాలకు చెక్ పెట్టే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారు. అదే సమయంలో  దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చక్రం తిప్పుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ ఏడాది చివర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయాన్ని సాధించింది.

నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ ఏడాది  కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్న సంచలనంగా మారింది.  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విపక్షాలు అడ్డగోలు విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగానే స్పందించారు. ఈ ఏడాది సెప్టెంబర్ కంటే ముందే  విపక్షాలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు కేసీఆర్ సంకేతాలను ఇచ్చారు. 

పార్లమెంట్ ఎన్నికలతో  పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రాజకీయంగా తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన కేసీఆర్ వ్యూహత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

విపక్షాలు ఎన్నికలకు ఇంకా సన్నద్దమయ్యే పరిస్థితి ఉండడం, అధికారంలో ఉండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుండి సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలోనే అసెంబ్లీని రద్దు చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు.

ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరోసారి ప్రజలకు వివరించేందుకుగాను  ఈ ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్  ఈ సభను నిర్వహించారు. ఈ సభ తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

అసెంబ్లీ రద్దు చేసిన రోజునే కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే ఒకరిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మాత్రం టిక్కెట్లను ఇవ్వలేదు.

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు పీపుల్స్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశాయి. అయితే టీఆర్ఎస్ దూకుడు ముందు పీపుల్స్ ఫ్రంట్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి 2, కాంగ్రెస్ కు 19 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడ  టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో  టీఆర్ఎస్ బలం ప్రస్తుతం 90కు చేరుకొంది. ఇంకా విపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది.

ఇప్పటికే టీడీపీకి చెందిన ఇధ్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ రాయబారం నడిపింది. త్వరలో వీరంతా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే  మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. అసెంబ్లీలో కూడ ఇదే ప్లాన్ ను అమలు చేసే దిశగా టీఆర్ఎస్ చీఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ మేరకు కేసీఆర్ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో రాయబారాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ రెండో దఫా ప్రమాణస్వీకారం చేశారు.  రెండో దఫా సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేసిన మరునాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  కేటీఆర్‌‌ను చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. పార్టీపై కేటీఆర్ కు అప్పగించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా కేటీఆర్ పర్యటనలను చేపట్టారు.

  రాష్ట్రంలో  పూర్తిస్థాయి కేబినెట్  ఏర్పాటు చేసుకోకుండానే తనతో పాటు మహమూద్ అలీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతేకాదు ఆయనకు కీలకమైన హోంమంత్రిత్వశాఖను కేటాయించారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో రెండో దఫా అధికారంలోకి రావడంతో కేసీఆర్ దేశ రాజకీయాలపై కేంద్రీకరించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.

ఒడిశా, బెంగాల్ సీఎంలతో  కేసీఆర్ చర్చించారు.  ఢిల్లీ కేంద్రంగా చేసుకొని మరికొన్ని పార్టీలతో  కేసీఆర్ చర్చలు జరపనున్నారు.జనవరి 1వ తేదీ వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. తెలంగాణ ఎన్నికల్లో  పీపుల్స్ ఫ్రంట్ తరపున ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా బాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు సిద్దమయ్యారు.

డిసెంబర్ 10వ తేదీన కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడ హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ప్రంట్ విషయమై కేసీఆర్ తో మమత చర్చించారు. 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే దేశ రాజకీయాల్లో  ఎవరిది పై చేయి అవుతోందోననే ఆసక్తి నెలకొంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్  పూర్తిగా దేశ రాజకీయాలపై కేంద్రీకరించే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. విపక్షాలకు చెక్ పెట్టడంతో పాటు రెండో సారి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. మొత్తంగా ఈ ఏడాది టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది.


సంబంధిత వార్తలు

2018 ఈయర్ రౌండప్: కమ్యూనిష్టులకు కలిసి రాలేదు

Follow Us:
Download App:
  • android
  • ios