తెలంగాణ (Telangana)లో కొత్తగా 201 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 220 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,927 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో (Telangana) గడచిన 24 గంటల్లో 47,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలలో 12 చొప్పున, నల్గొండ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

220 మంది కరోనా నుంచి కోలుకోగా, (corona deaths in telangana) ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,67,535కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,59,263కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 4,345 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 3,927కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 64, జగిత్యాల 3, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 9, ఖమ్మం 4, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 6, మంచిర్యాల 6, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 8, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 11, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 5 , పెద్దపల్లి 8, సిరిసిల్ల 4, రంగారెడ్డి 12, సిద్దిపేట 5, సంగారెడ్డి 4, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 12, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…