తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు మరణించారు. 258 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,541 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 


తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 23, రంగారెడ్డి జిల్లాలో13 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

258 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోగా, వైరస్ వల్ల ఒకరు మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,66,384కి చేరుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6,57,923 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,541 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,920కి చేరుకుంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 6, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 23, ఖమ్మం 3, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 9, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 5, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 12, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3 , పెద్దపల్లి 6, సిరిసిల్ల 3, రంగారెడ్డి 13, సిద్దిపేట 4, సంగారెడ్డి 2, సూర్యాపేట 6, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 10, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…