అభం, శుభం తెలియని ఆరేళ్ల పసిదానిపై ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. చిన్నారి అనే కనికరం లేకుండా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఆ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి తాజాగా పోలీసులు 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరేళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పనికోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువు కావడంతో... 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.