చెన్నూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం నాడు మంచిర్యాల నుండి చెన్నూరు వైపుకు ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జైపూర్ వద్ద  కల్వర్టును ఢీకొట్టింది. కల్వర్టును ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. బస్సు మరింత వేగంగా ఉంటే లోయలో పడిపోయేదని ప్రయాణీకులు చెబుతున్నారు.

బస్సును నడుపుతున్న  డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 70 మంది  ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణీకులకు గాయాలయ్యాయి.  గాయపడిన ప్రయాణీకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మూడు రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుట్కా వేసుకొనే సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో 60 మంది ప్రయాణీకులు గాయపడిన విషయం తెలిసిందే.

వీడియో

"