హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుర్గానగర్ చౌరస్తాలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డు మధ్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్తంభాన్ని ఢీకొట్టిన అనంతరం వీరిద్దరి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతులను ఆరాంఘర్‌కు చెందిన ఎండీ సజ్జాద్, మహ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు.