హైదరాబాద్: హైద్రాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో కంటైనర్ లారీకి విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. దీంతో లారీలోని ఇద్దరు సజీవదహనమయ్యారు.  బుధవారం నాడు కార్లను తరలిస్తున్న  కంటైనర్ లారీకి ప్రమాదవశాత్తు  విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో కంటైనర్ కు మంటలు వ్యాపించాయి. మంటలు  వ్యాప్తి చెండదంతో లారీలోని ఇద్దరు డ్రైవర్లు  సజీవదహనమయ్యాయి.

కంటైనర్ లోని   నాలుగు కార్లు కూడ అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ వైర్లు  కంటైనర్‌కి ఎలా తగిలాయనే విషయమై  అధికారులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడ ఈ తరహలోనే  కొన్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు. కానీ ఈ తరహ ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కంటైనర్ యజమానితో పాటు మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసుు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.