Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  

2 brs corporators joins in congress ahead of telangana assembly elections 2023 ksm
Author
First Published Oct 17, 2023, 2:45 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  జీహెచ్‌ఎంసీ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌,  మాదాపూర్ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. జగదీశ్వర్ గౌడ్ తన  సతీమణి పూజితతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక, జగదీశ్వర్ గౌడ్ సతీమణి పూజిత.. ప్రస్తుతం హఫీజ్ పేట కార్పొరేటర్‌గా ఉన్నారు. 

ఇక,  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన  శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం.. అక్కడి నుంచి పార్టీ తరఫున మరోసారి అరికెపూడి గాంధీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే జగదీశ్వర్ గౌడ్ దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న జగదీశ్వర్ గౌడ్ వారం రోజుల క్రితం బీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా చేసింది. అయితే మరోవైపు జగదీశ్వర్ గౌడ్‌, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరిగాయి. 

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక, జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ కార్పొరేటర్‌గా మూడు సార్లు విజయం సాధించగా.. ఆయన భార్య పూజిత ఫీజ్ పేట కార్పొరేటర్‌గా రెండు సార్లు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ.. అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చేందుకు అంగీకరించడంతోనే జగదీశ్వర్ గౌడ్ దంపతులు హస్తం గూటికి చేరినట్టుగా ప్రచారం సాగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios