తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,93,600కు చేరుకుంది. ఇక ఇప్పటికే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 2,474మంది రికవరీ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినుండి బయటపడ్డ వారి సంఖ్య 1,63,607కు చేరుకుంది. 

కరోనా మరణాల విషయాని వస్తే రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కేవలం 8మంది మాత్రమే చనిపోయారు. ఇలా మొత్తం మరణాల సంఖ్య 1135కు చేరుకుంది. అయితే జాతీయ స్థాయి మరణాల రేటు (1.56శాతం) కంటే తెలంగాణలో కరోనా మరణాల రేటు (0.58శాతం) తక్కువగా వుంది. రికవరీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 83.51శాతంగా వుంటే తెలంగాణలో 84.40శాతంగా వుంది. 

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,443 మందిని పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 30,50,444కు చేరింది. 

జిల్లాల వారిగా కరోనా కేసులు చేసుకుంటే జీహెచ్ఎంసీ 305, భద్రాద్రి కొత్తగూడెం 99, కామారెడ్డి 66, కరీంనగర్ 106, ఖమ్మం 99, మహబుబాబాద్ 59, మేడ్చల్ 153,  నల్గొండ 149, నిజామాబాద్ 65, రాజన్న సిరిసిల్ల 67, రంగారెడ్డి 191, సంగారెడ్డి 52, సిద్దిపేట 80, సూర్యాపేట 68, వరంగల్ అర్బన్ 131 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వుంది.