తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 54,534 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,913 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,87,456కి చేరింది
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 54,534 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,913 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,87,456కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,036కి చేరింది. కరోనా నుంచి నిన్న 232 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 1214, జగిత్యాల 9, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 4, కామారెడ్డి 7, కరీంనగర్ 24, ఖమ్మం 25, మహబూబ్‌నగర్ 12, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 33, మంచిర్యాల 12, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 161, ములుగు 0, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 16, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 28, పెద్దపల్లి 13, సిరిసిల్ల 3, రంగారెడ్డి 213, సిద్దిపేట 14, సంగారెడ్డి 24, సూర్యాపేట 10, వికారాబాద్ 12, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 24, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కోవిడ్ -19 (covid-19), డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో ఒకే రోజు 50 వేల కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా 1500 దాటాయి. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ అన్ని దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ చాలా దేశాలకు విస్తరించింది. అయితే ఈ వేరియంట్ స్వల్ప లక్షణాలను, స్వల్ప తీవ్రతను కలిగి ఉన్నా ఇది సోకడం వల్ల ధీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఢిల్లీ, కర్నాటక, చత్తీస్ ఘడ్, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటాన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, హాస్పిటల్ బెడ్స్, మెడిసిన్స్ వంటివి సిద్ధం చేసుకున్నాయి.
