Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా!

కరోనా కేసులు ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజుల కింద వరకు హైదరాబాద్ లోనే నమోదవుతున్న కేసులు లాక్ డౌన్ సడలింపులు పుణ్యమాని జిల్లాలకు కూడా మరల వ్యాపించడం మొదలయింది. జహీరాబాద్ పరిధిలోని ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా వైరస్ సోకడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

19 People From A Single Family Test COVID Positive
Author
Hyderabad, First Published Jun 13, 2020, 1:35 PM IST

తెలంగాణాలో కరోనా కేసులు ఉదృతు రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసులు పెర్గడంతోపాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

కరోనా కేసులు ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజుల కింద వరకు హైదరాబాద్ లోనే నమోదవుతున్న కేసులు లాక్ డౌన్ సడలింపులు పుణ్యమాని జిల్లాలకు కూడా మరల వ్యాపించడం మొదలయింది. 

జహీరాబాద్ పరిధిలోని ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా వైరస్ సోకడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే 9వ తేదీన ఒక 55 సంవత్సరాల మహిళ ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

అదే రోజు రామేతి ఆమహిళా అంత్యక్రియలను జహీరాబాద్ లో నిర్వహించారు. తెల్లారి వచ్చిన రిపోర్టులో ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు ఆ మహిళా సమీప బంధువులు అందరినీ ఇసోలాటిన్ కేంద్రానికి తరలించారు. 

25 మంది కుటుంబ సభ్యుల సాంపిల్స్ ను కరోనా పరీక్షలకు పంపగా 19 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కరోనా వైరస్ సోకినవారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. 

కుటుంబీకులతోపాటుగా అన్తజ్యక్రియల్లో మొత్తం 40 మంది వరకు పాల్గొన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్నవారందరి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆ అంత్యక్రియలు జరిగిన ప్రాంతం, వారి ఇంటి పరిసరాలను మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

శుక్రవారం కొత్తగా 164 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,035కి చేరింది. శుక్రవారం మరో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 174కి చేరుకుంది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,032 కాగా, 2,278 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 133 కేసులు నమోదవ్వగా... మేడ్చల్ 06, రంగారెడ్డి 6, సంగారెడ్డి 3, నిజామాబాద్ 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగుల్లో రెండేసి కేసుల చొప్పున సిద్ధిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

అటు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే  396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios