తెలంగాణ (Telangana)లో కొత్తగా 182 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 196 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,610 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 37,353 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 182 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,80,074కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో(corona deaths in telangana) కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,017కు చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు మహమ్మారి నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 6,72,447కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 14 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 259 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వీరికి చేసిన పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 63 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించగా.. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 1, జీహెచ్ఎంసీ 91, జగిత్యాల 7, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 6, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 0, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0 మంచిర్యాల 0, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 3, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, సిరిసిల్ల 5, రంగారెడ్డి 8, సిద్దిపేట 9, సంగారెడ్డి 5, సూర్యాపేట 0, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 18, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…