తెలంగాణ (Telangana)లో కొత్తగా 181 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 203 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,782 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 39,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 181 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,79,245కి చేరింది. నిన్న కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో (corona deaths in telangana) కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,013కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 203 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,782 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 6,891 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా.. వారిలో 22 మందికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వీరందరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపగా.. వీరిలో 8 మందికి ఒమిక్రాన్‌‌గా నిర్ధారణ అయింది. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 84, జగిత్యాల 2, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 5, ఖమ్మం 7, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 5, మంచిర్యాల 5, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 8, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 5, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 3, సిరిసిల్ల 1, రంగారెడ్డి 13, సిద్దిపేట 6, సంగారెడ్డి 1, సూర్యాపేట 1, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 14, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…