తెలంగాణ (Telangana)లో కొత్తగా 156 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 147 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,787 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 25,693 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 156 కరోనా కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌ వల్ల రాష్ట్రంలో నిన్న ఒకరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,999కి చేరింది. కరోనా బారి నుంచి 24 గంటల్లో 147 మంది పూర్తిగా కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 3,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. విదేశాల నుంచి ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన 291 మంది ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. వారికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిన 13 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఇక తాజా కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ (corona deaths in telangana) బారినపడిన వారి సంఖ్య 6,76,943కి చేరుకుంది. అలాగే మొత్తం రికవరీల సంఖ్య 6,69,157కి చేరింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 54, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 47, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0, మంచిర్యాల 3, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 0, రంగారెడ్డి 12, సిద్దిపేట 2, సంగారెడ్డి 1, సూర్యాపేట 1, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…