తెలంగాణ (Telangana)లో కొత్తగా 1520 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 209 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,168 యాక్టివ్‌ కేసులు వున్నాయి 

తెలంగాణలో (Telangana) కొవిడ్‌ మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా రెండోరోజూ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు 1000 దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,520 కొత్త కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 6,85,543కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో (corona deaths in telangana) మృతుల సంఖ్య 4,034కు చేరింది. కరోనా నుంచి నిన్న 209 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 6,168 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 13,652 మంది ప్రయాణికులకు శంషాబాద్‌లో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 207 మందికి కొవిడ్‌‌గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 162 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. వీరిలో 43 మంది కోలుకున్నారు. మరో 68 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 16, జీహెచ్ఎంసీ 979, జగిత్యాల 3, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 5, కామారెడ్డి 3, కరీంనగర్ 12, ఖమ్మం 21, మహబూబ్‌నగర్ 8, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 13, మంచిర్యాల 8, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 132, ములుగు 2, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 13, నారాయణపేట 2, నిర్మల్ 5, నిజామాబాద్ 16, పెద్దపల్లి 6, సిరిసిల్ల 5, రంగారెడ్డి 174, సిద్దిపేట 10, సంగారెడ్డి 26, సూర్యాపేట 16, వికారాబాద్ 2, వనపర్తి 8, వరంగల్ రూరల్ 4, హనుమకొండ 13, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…