కాంగ్రెస్‌లోకి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: షబ్బీర్ అలీ సంచలనం
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Congressలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ Sjabbir Aliసంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.Huzurabad bypoll టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించే టీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
also read:ఈటలను కలిశాను .. కానీ, నీలాగా చీకట్లో కాదు, ఫోటోలు పంపుతా చూసుకో: కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి Amit shah ను దాదాపు ప్రతివారం Kcr ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో Telangana ఉద్యమం సాగుతున్న తరుణంలో కూడ Trs పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిప ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా కూడ ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడ టీఆర్ఎస్ పార్టీ చేర్చుకొంది.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలను టీఆర్ఎస్,Bjp అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ నెల 30 హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని షబ్బీర్ అలీ చేసిన ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది. మైండ్‌గేమ్‌లో భాగంగానే షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారా.. లేదా నిజంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా అనే విషయమై వచ్చే నెలలో తేలనుంది.