తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,252 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,489 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,252 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,489 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ వల్ల రాష్ట్రంలో నిన్న 11 మంది మరణించారు. దీంతో కరోనా సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,521కి చేరింది. వైరస్ నుంచి నిన్న 1,436 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,975 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,07,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,84,429 మంది కోలుకున్నారు. కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.3 కాగా, తెలంగాణలో అది 0.57 శాతానికి తగ్గడం విశేషం. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 175 కేసులు నమోదయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 98, జీహెచ్ఎంసీ 175, జగిత్యాల 19, జనగామ 14, జయశంకర్ భూపాలపల్లి 25, గద్వాల 16, కామారెడ్డి 7, కరీంనగర్ 84, ఖమ్మం 118, మహబూబ్‌నగర్ 34, ఆసిఫాబాద్ 7, మహబూబాబాద్ 53, మంచిర్యాల 47, మెదక్ 12, మేడ్చల్ మల్కాజిగిరి 66, ములుగు 35, నాగర్ కర్నూల్ 23, నల్గగొండ 131, నారాయణపేట 12, నిర్మల్ 2, నిజామాబాద్ 13, పెద్దపల్లి 68, సిరిసిల్ల 28, రంగారెడ్డి 91, సిద్దిపేట 40, సంగారెడ్డి 26, సూర్యాపేట 82, వికారాబాద్ 23, వనపర్తి 28, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 49, యాదాద్రి భువనగిరిలో 34 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


Scroll to load tweet…