తెలంగాణలో 30 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,410 కేసులు, ఏడుగురి మృతి
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది, కేసుల సంఖ్య 30 వేల మార్క్‌ను దాటింది.. గురువారం కొత్తగా 1,410 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది, కేసుల సంఖ్య 30 వేల మార్క్‌ను దాటింది.. గురువారం కొత్తగా 1,410 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 30,946కి చేరుకుంది.
ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో .. మొత్తం మృతుల సంఖ్య 331కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,423 కాగా.. ఇవాళ 913 మంది డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 18,192కి చేరుకుంది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 918 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఆ తర్వాత రంగారెడ్డి 125, సంగారెడ్డి 79, మేడ్చల్ 67, వరంగల్ అర్బన్ 34, కరీంనగర్ 32, భద్రాద్రి 23, నల్గొండ 21, నిజామాబాద్ 18, మెదక్ 17, ఖమ్మం 12, సూర్యాపేట 10, మహబూబ్‌నగర్ 8, వికారాబాద్, మహబూబాబాద్‌లలో ఐదేసి, సిరిసిల్ల, వనపర్తి, గద్వాల, కామారెడ్డిలలో రెండేసి.. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, సిద్ధిపేటలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లో తొలి కరోనా మృతి నమోదయ్యింది. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న నర్సంపేటలోని స్నేహ నగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు.
దీంతో నర్సంపేట ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి రావడానికి కూడా భయపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా ప్రభలకుండా జాగ్రత్తలు వహిస్తూ అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కరోనా బారినపడి సీనియర్ పాత్రికేయుడు ఒకరు మృతిచెందిన విషాదం హైదరబాద్ లో చోటుచేసుకుంది.