తెలంగాణ (Telangana)లో కొత్తగా 140 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 186 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,499 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (telangana) గడిచిన 24 గంటల్లో 26,947 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 140 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా (corona cases) కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌తో మరణించిన (corona deaths in telangana) వారి సంఖ్య 4,021కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 186 మంది కోలుకున్నారు. వీటితో కలిపి తెలంగాణలో రికవరీల సంఖ్య 6,73,033కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,499 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 333 మంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా ఎనిమిది మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 11,245 మంది ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 83 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా.. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 10 మంది కోలుకోగా.. మరో 20 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 0, జీహెచ్ఎంసీ 92, జగిత్యాల 1, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 6, ఖమ్మం 1, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 1, మంచిర్యాల 0, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, సిరిసిల్ల 0, రంగారెడ్డి 14, సిద్దిపేట 4, సంగారెడ్డి 1, సూర్యాపేట 3, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి

Scroll to load tweet…