Asianet News TeluguAsianet News Telugu

జాతీయస్థాయిలో క్రీడాకారుడు.. 14ఏళ్లకే డిగ్రీ పట్టా..!

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం చదివాడు. 

14 years old boy completed his degree
Author
Hyderabad, First Published Nov 18, 2020, 11:55 AM IST

మూడేళ్లకు స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టినా.. పదోతరగతి పూర్తి చేయడానికి కనీసం 14ఏళ్లు పడుతుంది. కానీ.. ఓ చిన్నారి 14ఏళ్లకే ఏకంగా డిగ్రీ కూడా పూర్తి చేశాడు. కేవలం చదువుల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు కూడా. అటు ఆటల్లోనూ.. ఇటు చదువుల్లో దూసుకుపోతున్న ఈ చిన్నారిని చూస్తే.. ఎవరైనా అభినందించకుండా ఉండలేరు. అతనే కాచికూడకు చెందిన అగస్త్య జైస్వాల్.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్‌ పూర్తి చేశాడు.


తెలంగాణ రాష్ట్రంలోనే 14 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు. ఆగస్త్య జైస్వాల్‌ సోదరి నైనా జైస్వాల్‌ టేబుల్‌ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్‌ మాట్లాడుతూ చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios