రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే గ్రామ పెద్దలు ఈ బాలిక శీలానికి వెలకట్టి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలాల ఉన్నాయి. ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. తల్లిదండ్రులతో పాటు 14ఏళ్ల బాలిక కూడా బోడకొంట గ్రామ సమీపంలోని ఓ ఇటుక బట్టీలో పనికి కుదిరారు.  అదే గ్రామ శివారులో ఓ గుడిసె వేసుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు రమావత్ శ్రీను, మహేందర్ లు బాలికపై కన్నేశారు. బాలికను లోబర్చుకోడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి మంగళవారం తెల్లవారుజామున బాలిక ఒంటరిగా ఇటుక బట్టీలో కనిపించింది. దీంతో బాలికపై బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు అత్యంత దారుణంగా బలత్కారానికి పాల్పడ్డారు. 

తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లిదండులు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు బాలికి శీలానికి వెలకట్టి నిందితులను పోలీస్ కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఈ దారుణం గురించి తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, మంచాల సీఐ అనుదీప్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

బాధిత బాలిక తల్లిదండ్రులను ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితులిద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.