వంట గదిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 పాము పిల్లలు కనిపించాయి. దీంతో.. కుటుంబసభ్యులు ఒక్కసారిగా వాటిని చూసి జడుసుకున్నారు. ఈ సఘటన జాజ్ పూర్ జిల్లా సారంగపూర్ గ్రామంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సారంగపూర్ గ్రామానికి చెందిన పద్మలోచన మహంది అనే వ్యక్తి ఇంటి వంట గదిలో ఓ నాగుపాము సంచరిస్తున్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే.. భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో..హెల్ప్ లైన్ సభ్యులు వచ్చి వారింట్లో తనిఖీలు చేయగా.. ఒకటి కాదు.. ఏకంగా 14 పాము పిల్లలు కనిపించాయి. కిచెన్ లోని వంట గ్యాస్ సిలిండర్ కింద ఓ రంధ్రాన్ని గుర్తించారు. అందులో పరిశీలించగా.. పాము పిల్లలు కనిపించాయి. కాగా.. వాటిని పట్టుకొని.. జాగ్రత్తగా తీసుకువెళ్లి అడవిలో వదిలిపెట్టారు. కాగా... ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాములను చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు.