తెలంగాణ (Telangana)లో కొత్తగా 137 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 173 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,979 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, ములుగు, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 173 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటిదాకా వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,74,318 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,682 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,657 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో (corona deaths in telangana) కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 3,979కి పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 48, జగిత్యాల 3, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 11, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 3, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 3, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 8, సిరిసిల్ల 1, రంగారెడ్డి 16, సిద్దిపేట 2, సంగారెడ్డి 2, సూర్యాపేట 4, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 3, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…