Asianet News TeluguAsianet News Telugu

మెదక్ జిల్లాలో 13 ఏళ్లకే ఓటు హక్కు దక్కింది

ఉమ్మడి మెదక్ జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ వజీర్ అలీ అనే 13 ఏళ్ల బాలుడికి ఓటు హక్కు లభించింది

13 year old boy gets vote in medak district
Author
Medak, First Published May 6, 2019, 12:07 PM IST

ఆదిలాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ వజీర్ అలీ అనే 13 ఏళ్ల బాలుడికి ఓటు హక్కు లభించింది. 13 ఏళ్లకే ఆ బాలుడికి ఓటు హక్కును కల్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  సుమారు 20 లక్షలకు పైగా  ఓట్లు గల్లంతయ్యాయి.  ఈ విషయమై  ఎన్నికల సంఘం క్షమాపణలు చెప్పింది. ఎన్నికల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ వజీర్ అలీ అనే 13 ఏళ్ల బాలుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు.వజీర్ అలీ  ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉండడంతో అతని వయస్సు 18గా నమోదైంది.

అయితే వజీర్ అలీ పేరున ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకొంటే  క్షేత్రస్థాయి పరిశీలన చేసుకొంటే ఆ బాలుడికి ఓటు హక్కును కల్పించింది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌ నంబర్ 241 సీరియల్ నంబర్ 961 పై పేరు నమోదైంది. దీనిపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios