పాపం...అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఓ వృద్దుడి దారుణానికి ఒడిగట్టాడు. నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారిని వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. 

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ సూర్యనగర్ కాలనీలో ఓ కుటుంబం నివసిస్తోంది. అయితే ఈ కుటుంబానికి చెందిన ఓ 12 ఏళ్ల చిన్నారిపై పక్కింట్లో వుంటున్న ధశరథం(55) అనే వృద్దుడి కన్ను పడింది. ఇందుకోసం బాలికకు మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకున్నాడు. ఇవాళ ఆ చిన్నారి ఒంటరిగా వుండటంతో తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు.    

అయితే అతడి వికృత చేష్టల కారణంగా నొప్పిని తట్టుకోలేకపోయిన బాలిక గట్టిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకునే సరికి దశరథం బాలికపై ఇంకా అత్యాచారానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దీంతో బాలికను కాపాడి అతడికి దేహశుద్ది చేశారు. 

తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దశరథాన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.