విదేశాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి (shamshabad airport) వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి (tims hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన కరోనా వైరస్ (coronavirus) మరోమారు దండెత్తడానికి రెడీ అవుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ (omicron) రూపంలో ముప్పు పొంచి ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌వో ) (who)హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో విలయతాండవం చేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా సంక్రమిస్తుందని హెచ్చరించింది. 

Also Read:Omicron: ఈ టీకాలు ఒమిక్రాన్‌ను నిలువరించలేవ్.. ‘బూస్టర్’ ఇవ్వండి: కేంద్రానికి జీనోమ్ కన్సార్టియం సూచనలు

సౌతాఫ్రికాలో (south africa) వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. తాజాగా భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కేంద్రం శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఒమిక్రాన్ కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది ఏ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సంగతి పక్కనబెడితే.. విదేశాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి (shamshabad airport) వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి (tims hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. యూకే నుంచి 9 మంది, సింగపూర్, కెనడా, అమెరికాల నుంచి ఒక్కొక్కరు మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిం