బాలికపై పలుమార్లు అత్యచారానికి పాల్పడిన యువకుడికి నాంపల్లి కోర్టు.. పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు మొదటి ఎంఎస్ జే న్యాయమూర్తి సునీత కుంచాల బుధవారం తీర్పు ఇచ్చారు. 

కేసు వివరాలు ఇలా ఉన్నాయి... గాంధీనగర్‌కు చెందిన బి.అనుదీప్‌ వర్మ(23) సేల్స్‌మేన్‌. స్థానికంగా ఉండే స్నేహితుడి సోదరితో అతనికి పరిచయం ఏర్పడింది. ఒకరోజు దైవదర్శనం పేరుతో అనుదీప్‌ బాలికను యాదగిరిగుట్టకు తీసుకెళ్లి హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. గాంధీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అదనపు పీపీ కె. ప్రతాప్‌ రెడ్డి వాదనలతో ఏకీభవించిన కోర్టు... పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషికి జైలు శిక్ష, జరిమానా విధించింది.