ఒక ఇంట్లోకి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వంద పాములు ప్రవేశించాయి. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో చోటుచేసుకుంది. కాగా... ఆ పాములను చూసి సదరు ఇంట్లోని సభ్యులంతా భయంతో వణికిపోయారు.

Also Read సహజీవనం చేశాడు.... తీసుకున్న బాకీ తీర్చమన్నందుకు...

పూర్తి వివరాల్లోకి వెళితే... గత రెండు రోజులుగా నిరంజన్ ఇంట్లోకి వంద పాము పిల్లలు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కుటుంబ యజమానితో పాటు చుట్టు పక్కల వారు వచ్చి వాటిని చంపారు.

ఎన్నడూ లేని విధంగా ఒకే ఇంట్లోకి ఇన్ని పాములు రావడమేంటని గ్రామంలో చర్చ చోటు చేసుకున్నది. గ్రామంలో ముళ్ల కంపలు, చెత్తాచెదారం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.