మానేరు వాగులో చిక్కుకున్న పదిమంది కూలీలు... జేసిబిలు, లారీలతో సహా జలదిగ్భందం (వీడియో)
భారీ వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తున్న మానేరు వాగులో పదిమంది కూలీలు జేసిబిలు, లారీలతో సహా చిక్కుకున్నారు.
పెద్దపల్లి : తెలంగాణలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మానేరు వాగులో పదిమంది చిక్కుకున్నారు. మంథని మండలం గోపాల్ పూర్ ఇసుక క్వారీని ఒక్కసారిగా మానేరు వాగు వరదనీరు చుట్టుముట్టింది. దీంతో క్వారీలో పనిచేస్తున్న పదిమంది అందులోనే చిక్కుకున్నారు. వరదనీరు చుట్టుముట్టడంతో ఇసుక కుప్పలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
ఇసుక తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న జెసిబిలు, లారీలు కూడా మానేరు వాగు ఉదృతిలో చిక్కుకున్నాయి. అంతకంతకు మానేరు ప్రవాహం పెరుగుతుండటంతో క్వారీలో చిక్కుకున్నవారు భయపడిపోతున్నారు. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వీడియో
ఇసుక క్వారీలో పనిచేసే కూలీలు మానేరు ప్రవహంలో చిక్కుకున్నట్లు తెలిసి అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ప్రవాహంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా చూస్తామని... అవసరమైతే ఎన్టీఆర్ఎస్ బృందాలను తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. వాగులో చిక్కుకున్న కూలీలు కూడా ధైర్యంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More రోడ్లపైనే వరద ప్రహహం... స్తంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా (వీడియో)
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఏకంగా ఓ గ్రామమే జలదిగ్భందంలో చిక్కుకుంది. మొరంచపల్లి గ్రామాన్ని పక్కనే వుండే వాగునీరు ముంచెత్తడంతో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒకసారిగా మేల్కొన్న ప్రజలు హాహాకారాలు చేశారు. వెంటనే వరదలో కొట్టుకుపోకుండా ఇళ్లమీదికి ఎక్కి.. తమని తాము కాపాడుకుంటున్నారు. కాగా, క్షణక్షణానికి వరద నీరు పెరుగుతుండడంతో ప్రాణభయంతో కాపాడమంటూ వేడుకుంటున్నారు.
వరద నీరు భారీగా చేరుకోవడంతో బిల్డింగ్ లకు పైకి ఎక్కి ప్రాణాల రక్షించుకుంటున్నారు. మోరంచవాగు వరద ప్రవాహం గ్రామంలో ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో వరద నీటిలో ఇండ్లు తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే వెంటనే స్పందించిన అధికారులు ఆర్మీ హెలికాప్టర్లను ఏర్పాటుచేసి మోరంచ వాసులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.