సూర్యాపేట:సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం గణపవరం చెరువును పది గ్రామాల ప్రజలు సోమవారం నాడు లూటీ చేశారు. ఈ ఘటనపై మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గణపవరం గ్రామంలోని ఊర చెరువులో మత్స్యకారులు చేపలను పెంచుతున్నారు. మత్స్యకారుల సోసైటీ ఆధ్వర్యంలో  చేపలను  పెంచుతున్నారు.ఈ చెరువు సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండేళ్లుగా మత్స్యకారులు రెండేళ్ల నుండి ఈ చెరువులో చేపలను పెంచుతున్నారు.

శనివారం నుండి  ఈ చెరువులో చేపలు పడుతున్నారు. అయితే గణపవరం చెరువులో చేపలు ఫ్రీ అంటూ ప్రచారం సాగింది. దీంతో గణపవరం గ్రామంతో పాటు సమీపంలోని  10 గ్రామాల ప్రజలు ఈ చెరువుపై పడి లూటీ చేశారు.

వందలాది మంది ఈ చెరువులోకి దిగి చేపలను పట్టుకొన్నారు. ప్రజలను అడ్డుకొనేందుకు మత్స్యకారులు అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మత్స్యకారులను అడ్డుకొంటూ ప్రజలు చేపలను లూటీ చేశారు.  చేపల లూటి వీషయంలో సోసైటీలోని కొందరు సభ్యుల హస్తం కూడ ఉందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తమకు సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.