తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా నియమితులైన 10 మందితో చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ ఇవాళ ప్రమాణం చేయించారు.

హైదరాబాద్: Telangana Highh Courtలో కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలు గురువారం నాడు ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ Satish Sharma కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు. 

కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్,శ్రీదేవి, ఎస్‌.వి.శ్రావణ్ కుమార్, జి. అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున లు ఇవాళ హైకోర్టు జడ్జిలుగా ప్రమాణం చేశారు. కొత్తగా 10 మంది జడ్జిలు ప్రమాణం చేయడంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి చేరింది. Supreme Court కొలిజియం పది మంది జడ్జిల నియామకం కోసం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలిటియం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. పది మందిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి Ramnath Kovind ఉత్తర్వులు జారీ చేశారు.హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారితో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ ప్రమాణం చేయించారు.