Asianet News TeluguAsianet News Telugu

థోతీ ఫంక్షన్ : 10 మందికి కరోనా పాజిటివ్, ఒకరి పరిస్థితి విషమం..!

కరోనాతో ఓ వైపు దేశం వణికిపోతుంటే.. జనాలు పంక్షన్లను మాత్రం ఆపడం లేదు. ఫలితంగా కరోనా బారిన పడి ఇక్కట్లు కొని తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. ప్రజల్లో అవగాహన మాత్రం రావడం లేదు, మాకేం కాదులే అనే నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తుంది. 

10 members tested positive for corona virus in nalgonda who attened a dhoti function - bsb
Author
Hyderabad, First Published May 29, 2021, 12:29 PM IST

కరోనాతో ఓ వైపు దేశం వణికిపోతుంటే.. జనాలు పంక్షన్లను మాత్రం ఆపడం లేదు. ఫలితంగా కరోనా బారిన పడి ఇక్కట్లు కొని తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. ప్రజల్లో అవగాహన మాత్రం రావడం లేదు, మాకేం కాదులే అనే నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తుంది. 

తాజాగా ఇలాంటి సంఘటనే నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. తమ ఇంట్లో తలపెట్టిన శుభకార్యం ఆ కుటుంబాన్నే కుదిపేసింది. ఒకరి పరిస్థితి విషమంగా మార్చింది. 

వివరాల్లోకి వెడితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడేనికి చెందిన జానయ్య, లక్ష్మి దంపతులు ఇటీవల తమ కుమారుడు సాయికి ధోతీ ఫంక్షన్ చేశారు. ఈ ఫంక్షన్ కు నల్గొండ మండలం చెన్నుగూడేనికి చెందిన లక్ష్మి తల్లిదండ్రులైన మర్రి జంగయ్య, అలివేలు దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 

తెలంగాణ: మళ్లీ మూడున్నర వేలు దాటిన కరోనా కేసులు... 19 మంది...

అయితే, ఫంక్షన్ అయిన రెండు రోజులకు మొదట జానయ్య, లక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. వారికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. 

ఆ తరువాత లక్ష్మి తల్లిదండ్రులు జంగయ్య, అలివేలుతో పాటు వారి చిన్న కూతురు, పెద్ద కొడుకు సైదులు, అతని భార్య, బంధువులు మొత్తంగా పదిమంది వైరస్ బారిన పడ్డారు. 

జానయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన తొమ్మిదిమంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios