హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం నాడు  బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.విమానాశ్రయంలోని  డెకథ్లాన్‌ స్పోర్ట్స్‌ రూమ్‌లో బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది.. స్టోర్‌లో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం నాడు ఫోన్ చేశాడు.

 రిమోట్ బాంబ్ పెట్టినట్లు ఆగంతకుడు ఫోన్‌లో బెదిరించాడు.. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్‌తో బాంబుతోపేల్చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయభ్రాంతుకలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. విస్తృత త‌నిఖీల త‌ర్వాత బాంబు లేద‌ని పోలీసులు తేల్చి చెప్పడంతో స్టోర్ యాజ‌మాన్యం ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఫోన్‌ కాల్‌ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు ఎందుకు ఈ ఫోన్ కాల్ చేశాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడ ఎయిర్ పోర్టుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ రకంగా బెదిరింపు కాల్స్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.