హైదరాబాద్: హైద్రాబాద్ మియాపూర్‌లో బుధవారం నాడు ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు వాహనాలను ఢీకొడుతూ పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

హైద్రాబాద్ మియాపూర్‌లో బుధవారం నాడు ఉదయం ఓ కారును డ్రైవర్ అతి వేగంగా నడిపాడు. వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న పలువురిని ఈ కారు ఢీకొట్టింది.  వేగం అదుపు కాకపోవడంతో  కారు పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Aslo read:హైద్రాబాద్‌లో బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు: ఒకరు మృతి, నలుగురికి గాయాలు

మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పేట్ వద్ద బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ కారును నడపడంతో కారు అదుపుతప్పింది. కారును మితిమీరిన వేగంతో డ్రైవర్ నడిపిన కారణంగా  గ్రీన్ బావర్చి హొటల్ ముందు సిగరెట్ తాగుతున్న అఫ్సర్ అనే వ్యక్తి పైకి కారు దూసుకెళ్లింది.  అంతేకాదు కారు పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన అఫ్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.