Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వ్యాక్సిన్ డ్రైవ్ : ఫస్ట్ డోస్ కూడా అందనివారు ఇంకా 1.8 కోట్ల మంది...

హైదరాబాద్ : తెలంగాణలో వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హత కలిగిన 2.73 కోట్ల మందిలో ఇంకా 1.80 కోట్ల మంది ప్రజలు ఒక డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. థార్ఢ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంతో ఇది అధికారుల్లో ఆందోళనను కలిగిస్తోంది. దీనికోసం మాస్ వ్యాక్సినేషన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

1.8 crore population yet to get a single dose of vaccine in Telangana - bsb
Author
Hyderabad, First Published Jun 25, 2021, 9:28 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హత కలిగిన 2.73 కోట్ల మందిలో ఇంకా 1.80 కోట్ల మంది ప్రజలు ఒక డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. థార్ఢ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంతో ఇది అధికారుల్లో ఆందోళనను కలిగిస్తోంది. దీనికోసం మాస్ వ్యాక్సినేషన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ నిల్వలు రాష్ట్రంలో వేగంగా క్షీణించడంతో, ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా ఫస్ట్ డోస్ డ్రైవ్ ఆగిపోయే అవకాశం ఉంది. కారణమేంటంటే.. ఇప్పుడు రాష్ట్రంలో సెకండ్ డోస్ వేయాల్సినవారు పెండింగ్ లో ఉండడమే. దీనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 

ప్రస్తుతానికి, రాష్ట్రంలో 5.39 లక్షల డోసుల వ్యాక్సిన్ ఉంది. జూన్ చివరి నాటికి మరో 10.76 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల మందికి టీకాలు వేశారు. అందులో 64 లక్షల మంది సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రకారం రోజుకు 1.5-2 లక్షల డోసులు ఇస్తున్నాం. ఈ లెక్కన చూస్తే ఉన్న స్టాక్ ఒక వారానికి సరిపోతుంది. అప్పటికి స్టాక్ అందకపోతే.. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ఆపే అవసరం రావచ్చు.. అని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఈ ప్రకారం వ్యాక్సినేషన్ వేస్తుంటే.. అందరికీ ఫస్ట్ డోస్ పూర్తికావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ విషయంమీద ఇటీవల జరిగిన ఇన్నర్ మీటింగ్ లో కూలంకషంగా చర్చించాం. అదే విషయాన్ని అంతర్గత రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ప్రస్తావించిందని తెలిపారు.  

"జూలైలో, మరో 21 లక్షల డోసులు అందుతాయని అంచనా వేస్తున్నారు, కాని అందుబాటులో ఉన్న వయల్స్ ను పరిశీలిస్తే, రెండవ డోస్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కవర్ చేయడానికి ప్రభుత్వానికి ఇంకా 2.8 లక్షల డోసులు తగ్గుతున్నాయి’’ అని అధికారి తెలిపారు.

ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు వేయించుకోలేని వారు, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు భారీ సమస్యను ఎదుర్కొంటారని అధికారులు తెలిపారు. తెలంగాణకు ఇప్పటివరకు 88.33 లక్షల డోసుల కోవిడ్ -19 టీకాలు వచ్చాయి. 

వీటిలో జూన్ 22 లోగానే 82.94 లక్షలు వినియోగించారు. తెలంగాణ టీకా డ్రైవ్ ను అగ్రెసివ్ గా ప్లాన్ చేసింది. దీని ప్రకారం వ్యాక్సినేషన్ చేసినట్లైతే.. మొత్తం జనాభాకు ఒకటిన్నర నెలల్లో టీకాలు వేయచ్చు. అయితే దీనికోసం మరిన్ని డోసులు అవసరం పడతాయి. 

తెలంగాణ లో ఇస్తున్న రెండు వ్యాక్సిన్ల నిల్వలు ప్రభుత్వ కేంద్రాల్లో తరిగిపోతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవాక్సిన్ నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయి. "కోవాక్సిన్ స్టాక్‌ను సెకండ్  డోస్ కోసం పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios