మేసేంజర్ ద్వారా సమాచారం:మంత్రి సబితా కామెంట్స్ పై రాజ్ భవన్

తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై చర్చించేందుకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మేసేంజర్ ద్వారా సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయమై తనకు రాజ్ భవన్ నుండి సమాచారం లేదని మంత్రి సబితా వ్యాఖ్యలపై  రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి.

'We Sent Message To minister Sabitha Indra Reddy'

హైదరాబాద్: తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై  చర్చించేందుకు రావాలని సెప్టెంబర్ లోనే మేసేంజర్ ద్వారా సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై  చర్చించేందుకు తనకు రాజ్ భవన్ నుండి ఎలాంటి సమాచారం రాలేదని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు ఈ వ్యాఖ్యలపై మంగళవారంనాడు రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. ఈ విషయమై మంత్రి  సబితా ఇంద్రారెడ్డికి  సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.గవర్నర్ ఆఫీస్ నుండి సమాచారం  రాలేదని చెప్పడం సరైంది కాదని రాజ్ భవన్ వర్గాలుచెబుతున్నాయని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.

యూనివర్శిటీల్లో ఖాళీలను  భర్తీ చేయడం కోసం తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లును  ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ  బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.అయితే ఈ విషయమై యూజీసీకి కూడా గవర్నర్ లేఖరాశారు. సెప్టెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీ  పాస్ చేసిన  బిల్లులు గవర్నర్ ఆమోదం  కోసం వచ్చాయి.అయితే  ఈ బిల్లుల ఆమోదించలేదు.ఈ బిల్లులపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని గవర్నర్ గత నెలలో ప్రకటించారు. మీడియా  ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన సమయంలో  ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజ్ భవన్ వర్గాల నుండి కౌంటర్ రావడంతో మంత్రి సబితా  ఇంద్రారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారోననే ఆసక్తి  సర్వత్రా  నెలకొంది.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ,కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చోటు చేసుకుంది. తాజాగా తెరపైకి వచ్చిన అంశం మరోసారి చర్చకు దారి తీసింది.

also read:రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తెరపైకి మరో కొత్త వివాదం..!

రాష్ట్రంలో పలు యూనివర్శిటీల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. రాజ్ భవన్ కు వచ్చి పలు యూనివర్శీటీల విద్యార్ధులు గవర్నర్ తో చర్చించారు. విద్యార్ధుల సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని  కూడ గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ యూనివర్శిటీల్లొ పర్యటించడంపై టీఆర్ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios